*ఆర్.రమాదేవి కవిత్వంతో నా ప్రయాణం...20
*ఇది కథకాని కథ ... ఓ కాల్పనిక ప్రేమ కథ..!!
*ఈ ప్రేమ కథకు చివరకు పడింది..' శుభం' కార్డు'.!!
రమాదేవి గారు హైదరాబాద్లోనే వుంటున్నారు.ఉస్మానియా
యూనివర్సిటీలో చదువుకున్నారు.ఈ మధ్య ఫేస్బుక్లో….
విస్తృతంగా ప్రేమ కవిత్వం రాస్తున్నారు. ఓ ప్రత్యేకమైన
శైలిలోని పట్టుకున్నారు. చదువుకుంటూ పోతే ఓ భిన్న
మైన అనుభూతికి లోనవుతాం.ప్రేమ కవిత్వం ఎప్పుడూ
మనసును తడి చేస్తుంది.హృదయానికి రిలీఫ్ ఇస్తుంది..
రమాదేవి కవిత్వం ఇదే కోవలో సాగుతుంది.ఇదో ప్రేమ
కథ..అంతులేని కథ. వాళ్ళిద్దరూ.. కలిసినట్టే వుంటారు
కానీ..కలిసిన దాఖలాలు లేవు..వాళ్ళిద్దరి మధ్య ఎడ
బాటు ..తడబాటు తో పాటు ప్రేమ కూడా వుంది.కాక
పోతే..అది ఇంకా ఒక రూపానికి రాలేదు..ఎప్పుడొస్తుం
దోతెలీదు... అయితే..ప్రేమకు మార్పు,ముగింపులేద
న్నది ఈ కథ పిండితార్థం..!!
"అతను పిలుస్తాడు
వదిలి వెళ్ళిన వారెవరో గుర్తుకొస్తారు
అతడు తన ఇష్టాన్ని చెబుతాడు
వదిలేసిన ఇష్టాలు నా ముంగిట నిలుస్తాయి
అతదు ప్రశ్నిస్తాడు?
పదిల పరుచుకుని ఉన్న
అనుబంధానికి కొత్త రంగు అద్దుకుంటుంది
అతను మౌనంగా వింటాడు
దాచేసిన భావాలకు శ్వాస అందుతుంది..
అతను... నేను
బొమ్మ... బొరుసు
ఇప్పటికీ అర్థం కానిది ఒకటే
నాణేనికి ఒకేవైపు ఎలా ఉన్నాం!!
ముగింపులో ఓ చిన్న మెరుపు ఈ కవితకు అందాన్ని....
తెచ్చింది.ప్రేమ కవిత్వంలో సహజంగానే ప్రేయసీ ప్రియు
లుంటారు..ఇక్కడా అంతే...అతడు..ఆమె. వీరి మధ్య
కెమిస్ట్రీ లోనే చిన్న చిక్కు..అతడంటే..ఆమెకు ఎంతో
ఇష్టం..ఆమె అతడికి ప్రాణం.ఇద్దరూ ఒక నాణేనికి….
బొమ్మా బొరుసు లాంటి వారు..వచ్చిన చిక్కల్లా......
ఈ రెండు ఒకే నాణేనికి వున్నా... ఒకేవైపు పక్కపక్కనే లేకపోవడం.!
"అతని ఆలోచల్లోని
అముద్రిత అక్షరాలు
నాలోకి వంపాడు
అవి వడిసి పట్టే క్రమంలో
అక్షరంగా మారలేక
నిలిచాను
అర్థరహితం అనుకునే
అర్థంకాని అక్షరమై
ఇక్కడ
ఇందరి మధ్య నేను
బాధ్యతల ఒరలో నేను
నా ఊహల్లో నేను
అక్కడ
అతనన్నాడు
నీవు నాకు తెలుసని
నాలో నువ్వున్నావని
నా లోకమంతా నువ్వయ్యావని
నిజమెప్పుడు
అబద్ధంగానే కనిపిస్తుంది
కాబోలు...
ఇంతకూ నాకు
గురుతులేదు
నిజ నిరూపణకు
ఆనవాలు లేవు
నేనెప్పుడు.,
రెండు సగాలుగా
విడిపోయానో....!
ఈ కవితలో కూడా అంతే...ప్రేయసి ప్రియుల సమీకరణం
"ఒకటి ప్లస్ ఒకటి..ఈజ్ ఈక్వల్ టు ఒకటి." కానీ ఇక్కడ
ఈక్వేషన్ మారింది.ఇద్దరూ రెండు భాగాలుగా విడిపోయా
రు.అయితే...నిజనిరూపణకు ఆనవాళ్ళు లేవని మనల్ని
డైలమాలోకి నెట్టేస్తుంది కవయిత్రి.అంతేనా? నిజమెప్పు
డూ...అబధ్ధంగా కనిపిస్తుందని అసలు విషయాన్ని చెప్పక
నే చెబుతుంది.తనలో అతనున్నాడని ,ఆమె లోకమంతా
అతడేనని తెలుసు..అయినా..ప్రేమలో అసందిగ్ధత,......
ఝంఝాటం..వారిని వేరుచేస్తున్నాయి.
"ప్రేమను తూకం వేయడం
ఎక్కడ నేర్చుకున్నావ్
నాతో నడిచిన అడుగు చెబుతుందా
గడిచిన గతం చెబుతుందా
నీవు వినే మాట చెబుతుందా
నేను అనే మాట చెబుతుందా
నీ ఊహ చెబుతుందా
నా భావం చెపుతుందా
మరులుగొన్న మది చెబుతుందా
మరిచి పొమ్మనే మధువు చెబుతుందా
ఏది చెపుతుంది...
ప్రేమలోని నాణ్యతను
ప్రేమను పంచడం కష్టం
బంధించడం మరింత కష్టం
...........
తూకం వేయడం అంటే
నీకు నువ్వు ఖరీదు కట్టుకోవడమే!!
ప్రేమంటే ఏమిటి? దానికి కొలమానం వుంటుందా? వుంటే
దాన్ని తూకం వేయడం ఎలా? ప్రేమలో నాణ్యత వుంటుం
దా? వుంటే దాన్ని నోగ్గుతీయడం ఎలా?అయినా ప్రేమకు తూకం,నాణ్యత లేమిటీ? పిచ్చిగాకపోతేను.... ? ప్రేమను పంచడం కష్టం.బంధించడం మరింత కష్టం.అంచనా వేయి
డం ఇంకా కష్టం.ఇక ప్రేమను తూకం వేయడం అంటే,'నీకు
నువ్వు ఖరీదు కట్టుకోవడమే' అంటున్నారు రమాదేవి.
అయినా..ఒకరు అడిగారనో...ఒకరికోసమో ప్రేమిస్తారా! ఏమిటీ?ఒకరు అడిగారని ప్రేమించరు....ఎవరో కోరారని ప్రేమించరు....ఒక్కోసారి ప్రేమించామని జీవితమంతా... మనకే తెలియదు...ప్రేమించిన మనిషి మనకంటికెదురుగా ఉన్నంతవరకు..ప్రేమ అనే పదం పలకడంసులువు.ఆస్వా
దించడం నిరంతర కృషి....మనసు స్వచ్చతకు ఒక ఆన
వాలు. ఎవరు నిందించినా,ఎవరునిరాకరించినా ఎవరు
బంధించినా, చిట్టడవిలో కనుమరుగున ఉన్న గంధం
చెట్టు సువాసనలా అందరిని అల్లుకుంటూనే ఉంటుంది..
.ప్రేమ గెలిచినా..ఓడినా...పోరాడుతూనే ఉంటుంది తన మనుగడకోసం నిరంతరం...ఒకరి భాష్యానికి..ఒకరి భావా
నికి కట్టుబడిపోదు....అందుకే ప్రతీ ఒక్కరికి ఇంతటి ఆరా
ధన ప్రేమంటే...నీకు లాగనే …!
జీవితం ఆకట్టుకోక పోయినా... ప్రేమ మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది. ప్రేమించని మనిషి ఉండదు.కాకపోతే
దేన్నీ ప్రేమించాడో తెలుసుకోలేకపోవచ్చు... కాని ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకున్నా…..జీవితం పై పెద్దగా ఆశలు లేవు అంటూనే.. జీవితం అంటే నే విసుగు పుట్టిం
దని చాటింపు వేస్తూనే... ఈ జీవితమే వద్దంటూ ..తృణీ
కరిస్తూనే... ఎవరిపై చెప్పని చాడీలుచెపుతూనే.."నిజంగా
నీకు నేను వద్దా అని జీవితం మన ఎదుట నిలబడి ప్రశ్నిం
చినపుడు...." అపుడు ఆలోచనలో పడతాడు... తనకు జీవితంపై ఎంతటి అనురాగమో... జీవితానికి ప్రేమించ
డమే తెలుసు...తనకు తెలిసింది మనకు అందించడమే తెలుసు.... ఎందుకంటే అది నీలాంటిదే కాబట్టి...
అందుకే జీవితంపై నాకు ఎటువంటి ఫిర్యాదు లేదు...
అది ఏది ఇచ్చినా నా దోసిట ఒడిసి పడతాను...అది ఇచ్చేది నా దోసిట పిడికెడు ఇసుకే కావొచ్చు, గులాబి
మొగ్గే కావొచ్చు.తుమ్మముళ్ళే కానీ,గులక రాయేకానీ,
రంగుల నెమలీకలా నామనసంతా జ్ఞాపకాలై నిండి
పోతాయేమో. ఇది నేను నమ్మే నిజం ... మిమ్మల్ని నమ్మమని అడగలేను.. నమ్మొద్దని శాసించ లేను.!
ఏదో ఒకసమయం.. నేను ఏమి ఆలోచించడం లేదను
కుంటూనే ఉన్నపుడు.. నా మనసు ఉల్లాసంగా పడవ ప్రయాణానికి వెళ్తుంది...అందుకు సాక్ష్యం తనతో తెచ్చే ఇసుకరేణువులు.. దోసిట ఉన్న ఇసుకతో ఈ తడి ఇసు
కని కలిపి పిచ్చుక గూడు చేస్తాను..... అలసిన మనసు వడలిన ఆకుతో వస్తే గులాబీ మొగ్గని తోడుగా చేసి జీవం పోస్తా... చెమ్మగిల్లిన మనసు తడితో తుమ్మ ముల్లునే గులాబి ముళ్ళుగా మారుస్తా...ఏదైనా చేయగలను….
జీవిత మిచ్చిన ఇన్ని బహుమతులు ఒదిగి ఒదిగి నా
దోసిలి నిండుగా ఉన్నపుడు ,జీవితమిచ్చిన బహుమతు
లకు నేను రంగుల కాగితంతో అలంకరిస్తున్న నెమలీక లాంటి నువ్వు ఎదురైతే అందిద్దామని"...('నెమలీక ) అంటోందిఆమె ప్రేమ పట్ల రమాదేవి గారికి ఓ స్పష్టమైన అవగాహన వుంది.
అందుకే…,
"ఇలా నువ్వుండిపోవా!
నుదుటి మీది కుంకుమల్లె నువ్వుండిపో....
పెదవిమీది నవ్వల్లె నువ్వుండిపో ....
బుగ్గమీది చుక్కల్లె నువ్వుండిపో...
ఎదలోని బాధల్లె నువ్వుండిపో...
ఒడిలోని పాపల్లె నువ్వుండిపో...
వెలలేని నీడల్లే నువ్వుండిపో...
చెంపమీది దెబ్బల్లె నువ్వుండిపో...
మేను మీది తళుకల్లె నువ్వుండిపో...
కొండ మీది దేవుడల్లె నువ్వుండిపో...
కంటిలోని తడిలా నువ్వుండిపో...
కలలోని కథలా నువ్వుండిపో...
గుడిలోని దీపంలా నువ్వుండిపో...
...అంటూ ఆమె అతడ్ని వేడుకుంటుంది.'..
మరి అతడు అనుగ్రహిస్తాడా? అంటే…..,
"అతను రోజు ఎదురు పడతాడు. కరకు మనసుకరిగించా
లని కాబోలు.. రోజూ చిరునవ్వే బదులేమి అందకున్నా...
అతను ఎదురుపడని రోజు రహదారి అంచుల్లోచిరునవ్వు
లు తన నీడలో ఒదిగిన అడుగుజాడలు కరకు మనసుకు
కబుర్లు వినిపించేవి...తన ఊహలకు రంగులు వేసే అల
వాటు కాబోలు,అనుమతి లేని అతడు ఆక్రమించాడు"
స్వప్నాలు వెతుక్కునే దారిలోఎన్నో మలుపులు.. ప్రతీ
మలుపులో అతిదగ్గరగా అతడే..అందనంత దూరంలో.. ఆకాశమంత అతడే..అయినా అతగాడి ధోరణి సరిగా
లేదు...ఆమెతో పరుషంగా మాట్లాడాడు.ఇది ఆమె
ఊహించని పరిణామం.
అతని పరుషపు మాటలకుమనసు చిద్రమై ముక్కలు
ముక్కలై ఎక్కడో రాలాయి..అయినా...ఆమె గిజిగాడు
గూడు లాగా...అతని చుట్టూ అల్లుకుపోతూనే వుంది.
అది ప్రేమో ఆరాధనో వెర్రో..తెలుసుకునే తెలివి రానేలేదు..
అతడికోసం ఆమె దాచిన మాటలు విసిగి వేసారి కరిగి
నీరైపోయాయి.అవసరానికి ఒక్కటి కూడా మిగల్లేదు....!
నిన్న ఏమయిందో? రేపు ఏమవుతుందో? అయినా ఆమె
అతడికోసం కాలం లెక్కింపు కొనసాగిస్తూనే ఉంది.అతడు
బంధం తెంచుకుంటే...ఆమె ప్రేమ మరుగునపడుతుందా?
అతడ్ని మరిచిపోతుందా?.అతడి జ్ఞాపకాలకు కొత్తరంగు
లద్ది....మరువలేని బంధంతోమది నింపుతానంటోంది ...
ఆమె.!!
అతడు ఎప్పటినుంచో తెలుసు.అయినా.....ఆమెకు అతడు"మొదలు పెట్టిన ఉత్తరమే ఇప్పటికీ " దాగుడు
మూతలు ఆడే మనసుకి కళ్లెం వేయాలంటే ప్రణయమో?
ప్రళయమో?దరి చేరాలి.లేదంటే యోగినో...భైరాగినో
అయ్యి తీరాలి కాబోలు అంటూ..తనను తాను ఓదార్చు
కుంటోంది.!!
అతడంటే ఆమెకు ఎంతో ఇష్టం.ఈ మాట ఎన్నిసార్లు చెప్పినా ఆమెకుఅలుపు రాదు.బహుశాఆ ఇష్టంలో అతడు..ఆమె…అతడిలో ఆమె...ఆమెలో అతడు ఉన్నందుకు కాబోలు…!
చివరకు….ఆరోజు రానే వచ్చింది…!!
ప్రతి చినుకు ఓ సంద్రమై కోటి సముద్రాలగా మారి ఆమెను
తనలో కలుపుకున్నాడు.ఇప్పుడు ఆమె లేదు. అతడు కూడా లేడు …ఓ ఉదృతి ఓ విస్పోటం...నిశ్శబ్దం.నిశ్చల
మైన. ఓ నిశ్శబ్దం..!
ప్రేమికుల మధ్య ఎడబాటు,తడబాట్లు సహజమే అయినా
అవి ఎంతోకాలం నిలవవు.ఇప్పుడు ఈ ప్రేమ ఈక్వేషన్ మారింది..ఒకటి ఒకటి ఈజ్ ఈక్వల్ టు ఒకటే... ఇప్పుడు
వాళ్ళిద్దరూ ఒకే గొంతుకతో పాడుకునే యుగళ గీతం.
అదండీ సంగతి..ఈ ప్రేమకథకు ఇలా శుభం కార్డు పడింది.
*కవయిత్రి ఆర్. రమాదేవి గారికి అభినందనలు ❤️❤️.
*ఎ.రజాహుస్సేన్…!!
(A.Raja Hussain)
నంది వెలుగు.